![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu ). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-510 లో.. నర్మద ఒక దగ్గర కూర్చొని జరిగింది తల్చుకొని ఏడుస్తుంటుంది. అప్పుడే తన దగ్గరికి ధీరజ్, ప్రేమ వస్తారు. బాధపడకండి వదిన అని ధీరజ్, అత్తయ్య అన్నదానికి ఫీల్ కాకు అక్క అని ప్రేమ అనగానే నేను ఎందుకు ఫీల్ అవుతాను.. అత్తయ్యకి నిజం తెలియదు కాబట్టి అలా ప్రవర్తిస్తుంది నిజం తెలిసిన రోజు తనే పశ్చాత్తాపపడుతుందని నర్మద అంటుంది. మరి నిజం చెప్పేస్తే బాగుండు కదా వదిన అని ధీరజ్ అనగానే సమయం దాటిపోయిందని నర్మద అంటుంది.
ఇక మరోవైపు శ్రీవల్లి మేకప్ వేసుకుంటూ రెడీ అవుతుంటుంది. అప్పుడే అక్కడికి సుకన్య వస్తుంది. ఏంటే ఇలా రెడీ అవుతున్నావ్ పెళ్ళిచూపులా అని సుకన్య అనగానే అవునని శ్రీవల్లి అంటుంది. అదేంటని సుకన్య అడుగగా ఇకనుండి నర్మదని అత్తయ్య తిడుతూ, కసురుకుంటుంది.. అదంతా చూడటానికే ఇలా రెడీ అవుతున్నానని శ్రీవల్లి అంటుంది. మరోవైపు ప్రేమ ఫోన్ కి డ్యాన్స్ కాంపిటీషన్ మేనేజర్ కాల్ చేస్తాడు. అక్కడే ఉన్న ధీరజ్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. ఎవడ్రా నువ్వు అంటూ ధీరజ్ కోప్పడతాడు. ఇక అప్పుడే ప్రేమ వస్తుంది. ప్రేమ ఫోన్ తీసుకొని మాట్లాడతుంది. నీ డ్యాన్స్ చూసి అందరు ఇంప్రెస్ అయ్యారు.. నువ్వు ఖచ్చితంగా రావాలని ప్రేమతో అతను అనగానే సరేనని ప్రేమ అంటుంది.
గార్డెన్ ఏరియాలో చందు బాధపడుతుంటే అక్కడికి ధీరజ్ వచ్చి ఓదార్చుతాడు. అదే సమయంలో సాగర్, నర్మద అక్కడికి వస్తారు. ఏంట్రా పెద్దోడా ఎందుకురా అలా ఉన్నావని సాగర్ అడుగుతాడు. వదినకి ప్రెగ్నెన్సీ పోయిందని అక్కడే ఉన్న ధీరజ్ చెప్తాడు. దాంతో అయ్యో.. నాకు తెలియదురా అని సాగర్ అంటాడు. ఎలా అయిందని సాగర్ అడుగగా నర్మద వంక చూస్తాడు చందు. ఏంట్రా నేను అడుగుతుంటే నర్మద వంక అలా చూస్తున్నావని సాగర్ అంటాడు. అదేం లేదురా వదిలెయ్ అని చెప్పి చందు కవర్ చేస్తాడు. సాగర్ వెళ్ళిపోయాక.. నీ వల్ల వల్లి ప్రెగ్నెన్సీ పోయిందని తెలిస్తే మీ ఇద్దరి మధ్య గొడవ అవుతుందని చెప్పలేదంటూ నర్మదతో చందు అంటాడు. చందుతో నర్మద ఏదో చెప్పబోతుంటే వదిలెయ్ అని అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వేదవతి దగ్గరికి నర్మద వెళ్ళి రిక్వెస్ట్ గా మాట్లాడుతుంది కానీ వేదవతి మాత్రం కోపంగా ఉంటుంది. గిన్నెలు అన్నీ ఎత్తేసుకుంటూ నర్మద మీద కోప్పడుతుంది. దాంతో రామరాజు వస్తాడు. ఇక నర్మదని ఇండైరెక్ట్ గా వేదవతి తిడుతుంటే దూరం నుండి సుకన్య, శ్రీవల్లి చూసి నవ్వుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |